RC16: మార్చి తొలి వారం నుంచి ఢిల్లీలో కుస్తీ 1 y ago
కథానాయకుడు రామ్‌చరణ్.. దర్శకుడు బుచ్చిబాబు సనా కలయికలో ఓ స్పోర్ట్స్ డ్రామా సినిమా ముస్తాబవుతోంది. మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జాన్వీ కపూర్ కథానాయిక. శివ రాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా తాజాగా హైదరాబాద్ లో ఓ కీలక షెడ్యూల్ పూర్తి చేసుకున్నట్లు తెలిసింది. కాగా, తదుపరి షెడ్యూల్ మార్చి తొలి వారం నుంచి ఢిల్లీలో మొదలు కానుందని సమాచారం. ఆ షెడ్యూల్లో రామ్‌చరణ్ పాటు ప్రధాన తారాగణంపై కుస్తీ నేపథ్య సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది.